కరోనా సేకండ్‌వేవ్ ప్రజలను కకావికలం చేస్తోంది. దేశంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీని నుంచి బతికి బట్టకట్టడమే కర్తవ్యంగా పోరాడుతున్నారు దేశ ప్రజలు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో సంచలన విషయాలు బయటికొచ్చాయి. కరోనా సోకిన వారి నాసికా ద్రవాలు, నోటి మార్గాల ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్ బహిర్గతవుతుందని, మురుగునీటిలో కరోనా వైరస్ ఏడు రోజుల పాటు బతికుంటుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) హైదరాబాద్ సైటిస్టుల పరిశోధనలో వెల్లడైంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment