2020-21 విద్యా సంవత్సరంలో ఫార్మేటివ్ పరీక్షల మార్కులు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఆరు నుంచి పదోతరగతి విద్యార్థులకు నిర్వహించిన ఫార్మేటివ్-1, 2 పరీక్షల మార్కులను ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ప్రాథమిక తరగతులకు ఈ విషయంలో ప్రభుత్వం మినహాయింపు కల్పించడంతో ఆయా ప్రధానోపాధ్యాయులకు కొంత వెసులుబాటు కలిగింది. తొలిదశ కొవిడ్ అనంతరం గత నవంబరు 2 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. తొలుత 9, 10 తరగతులే నిర్వహించారు. విడతల వారీగా మిగిలిన తరగుతులు నిర్వహించారు. చివరగా జనవరి 19న ఆరో తరగతి, ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రాథమిక తరగతులు ప్రారంభించారు. నాలుగింటికి గానూ ఫిబ్రవరి, మార్చిలో రెండు ఫార్మేటివ్‌లను మాత్రమే నిర్వహించారు. సమ్మేటివ్ పరీక్షలు ఇంకా జరగలేదు. ఏప్రిల్ 23 నుంచి 1-9 తరగతులకు, జూన్ 7 నుంచి పదోతరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ వీటి నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం ఫార్మేటివ్ పరీక్షలను ప్రామాణికంగా తీసుకునే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు. తొలుత ఏప్రిల్ 20 నాటికే ఆన్‌లైన్‌లో నమోదుచేసేలా ఆదేశించినా వెబ్‌సైట్ తెరుచుకోలేదు. ప్రాథమిక విద్య తరగతులు ప్రారంభం కొంత ఆలస్యం కావడం, ఎన్నికల ప్రక్రియతో కొన్ని చోట్ల పరీక్షలు నిర్వహించనట్లు తెలుస్తోంది. దీంతో 6-10 తరగతుల మార్కులనే పరిగణనలోకి తీసుకుంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment