కరోనా కారణంగా చాలా మంది ఆక్సిజన్ సమస్యలతో సతమతమవుతున్నారు. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఈ ఆహార పదార్థాలు డైట్ లో తీసుకుంటే మంచిది. దీనితో ఆక్సిజన్ లెవెల్స్ పెంపొందించుకోవడానికి వీలవుతుంది.
శెనగలు:
శెనగలు లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆక్సిజన్ లెవెల్స్ ని సరిగ్గా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు మీ డైట్ లో దీన్ని తీసుకోండి.
కమల:
కమల లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఇది బాగా సహాయ పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే కమల తీసుకోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగుంటాయి.
పుచ్చకాయ:
పుచ్చకాయ వేసవిలో మనకి దొరుకుతుంది. ఇందులో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది ఇది ఆక్సిజన్ లెవల్స్ ను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది.
స్ట్రాబెర్రీస్:
స్ట్రాబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి మరియు విటమిన్ సి కూడా ఇందులో అధికంగా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి స్ట్రాబెర్రీస్ బాగా సహాయపడతాయి. కనుక కరోనా పేషంట్స్ వాళ్ళ డైట్ లో వీటిని కూడా తీసుకోవడం మంచిది.
ఆపిల్:
ఆపిల్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొత్త కణాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. అదే విధంగా ఆక్సిజన్ లెవెల్స్ ని పెంపొందించుకోవడానికి కూడా ఆపిల్స్ బాగా సహాయపడుతాయి.
కివి:
కివి లో కూడా అద్భుత గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కరోనా వైరస్ నుండి రికవరీ అవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు.
మామిడి:
మామిడి పండ్లలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ లెవెల్స్ ని కూడా పెంపొందించుకోవడానికి మామిడి బాగా సహాయపడుతుంది.
ఉసిరి:
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి మరియు విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ ని పెంపొందించుకోవడానికి ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి మీరు మీ డైట్ లో ఉసిరిని కూడా తీసుకోండి.
వేయించిన జీలకర్ర:
ఆక్సిజన్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కనుక వేయించిన జీలకర్ర తీసుకోండి. ఇందులో సాల్ట్ ని యాడ్ చెయ్యవద్దు.
విటమిన్ డి:
ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా మైంటైన్ చేసుకోడానికి విటమిన్-డి అధికంగా ఉండే ఆహార పదార్థాలు కూడా సహాయపడతాయి. ఈ విధంగా మీరు ఆక్సిజన్ లెవెల్స్ ని పెంపొందించుకోవచ్చు.
0 comments:
Post a Comment