భారత ప్రభుత్వం కొత్తగా తీసుకుని వచ్చిన ఇంటర్నెట్ నిబంధనలు అమలు విషయంలో కోర్టును ఆశ్రయించింది వాట్సాప్ సంస్థ. భారత ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. వాట్సప్ యాప్ గోప్యతకు ఆటంకం కలిగినట్లే అవుతుందని తద్వారా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందంటూ కోర్టులో దావా వేసింది వాట్సప్. ప్రభుత్వం విధించిన నిబంధనల అమలును నిరోధించాలంటూ వాట్సప్ వ్యాజ్యం వేసింది. ప్రైవేట్ సందేశాలను పంపేందుకు వీలుగా ఉండే ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్.. అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని వ్యాజ్యంలో వెల్లడించింది.
“డిజిటల్‌గా మెసేజ్‌లను పంపుకునే బిలియన్ల మంది ప్రజల గోప్యతను ఈ కొత్త రూల్స్ దెబ్బతీస్తాయి.” అని వాట్సప్ అంటుంది. “ప్రపంచవ్యాప్తంగా పౌర సమాజం మరియు సాంకేతిక నిపుణుల ప్రైవేట్ సందేశాలను ప్రభుత్వానికి ఇవ్వవలసి వస్తే.. ఎండ్-టు-ఎండ్ సెక్యురిటీ దెబ్బ తింటుందని, దుర్వినియోగానికి దారితీస్తుందని వాట్సాప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. “ప్రజల వ్యక్తిగత సందేశాల గోప్యతను పరిరక్షించడానికి వాట్సాప్ కట్టుబడి ఉందని, అలా చేయడానికి భారతదేశ చట్టాలలో మేము చేయగలిగినదంతా చేస్తూనే ఉంటాము.” అని వాట్సప్ చెబుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో The Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code) Rules, 2021ని నోటిఫై చేసింది. వార్తా వెబ్‌సైట్లు, ఓటీటీలు, సోషల్ మీడియాకు సంబంధించిన ఆ కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. నిబంధనలన అమలుకు ఆయా సంస్థలు భారత్‌లో అధికారులను నియమించుకోవడం, నెటిజన్ల ఫిర్యాదులను పరిష్కరించడం, ఎవరైనా అభ్యంతరక కంటెంట్ పోస్ట్ చేస్తే తొలగించడం వంటివి చేయాలి. ఏదైనా పోస్ట్ లేదా మెసేజ్ గురించి ప్రభుత్వం అడిగితే.. ఆ మెసేజ్‌ను మొదట ఎవరు సృష్టించారు? అనే వివరాలను వెల్లడించాలి.
0 comments:
Post a Comment