ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ బాధితులకు చికిత్స అందించే ప్రైవేటు నర్సింగ్ హోమ్ లు, అస్పత్రుల్లో చికిత్స ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా ఎన్ఏబీహెచ్ అక్రిడేషన్ కలిగిన ఆస్పత్రులకు ఒక ధర, అక్రిడేషన్ లేని ఆస్పత్రులకు మరో ధర నిర్థరించారు. నాన్ క్రిటికల్ కేర్ కోసం ఎన్ఏబీ హెచ్ అక్రిడేషన్ కలిగిన అస్పత్రుల్లో రూ.4వేలు, అక్రిడేషన్ లేని ఆస్పత్రులు రూ.3600 మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది.
ఆక్సిజన్తో కూడిన కోవిడ్ చికిత్స అందిస్తే రోజుకు రూ.6500, అక్రిడేషన్ లేని ఆస్పత్రులకు రూ.5,850 మాత్రమే వసూలు చేయాలని ప్రకటించింది. క్రిటికల్ కేర్ కోసం ఐసీయూ, వెంటిలేటర్ల కోసం రోజుకు రూ.12 వేలు, రూ.16 వేలుగా ఫీజుల నిర్ధారిస్తూ ఆదేశాలు ఎన్ఎబీహెచ్ అక్రిడేషన్ లేని ఆస్పత్రులకు రోజుకు ఐసీయూకి రూ.10,800, వెంటిలేటర్ కు రూ.14,400 మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది.
ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లో కన్సల్టెన్సీ, నర్సింగ్ ఛార్జీలు, గది అద్దె, రోగికి భోజనం, కోవిడ్ పరీక్ష ఛార్జి, పీపీఈ కిట్లు, ఔషధాలు ఉంటాయని స్పష్టం చేసింది. కోవిడ్ ఆస్పత్రులుగా నోటిఫై అయిన వెంటనే కోవిడ్ రోగులను చేర్చుకోవాలని, నిరాకరించవద్దని ఆదేశాల్లో పేర్కొంది. కోవిడ్ బాధితుల నుంచి ఎలాంటి అడ్వాన్సు చెల్లింపులు తీసుకోవద్దని స్పష్టం చేసింది. సీటీ స్కాన్ కోసం రూ.3 వేలు, రెమెడిసివిర్ ఇంజెక్షన్ వైల్ కు రూ.2,500, టాక్లిజూమబ్ కు రూ.30 వేలు మాత్రమే ఛార్జి చేయాలని పేర్కొంది. అంతేకాకుండా ధర వివరాలను ప్రతీ ప్రైవేటు ఆస్పత్రులోనూ ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది.
0 comments:
Post a Comment