యాంటీబాడీల్లో మొదటిది టీ కిల్లర్ సెల్స్, రెండోది మెమొరీ బీ సెల్స్. టీ కిల్లర్స్ సెల్స్ వైరస్‌ను చంపే పని చేస్తే, మెమొరీ బీ సెల్స్ భవిష్యత్తులో వైరస్ మళ్లీ విజృంభిస్తే దాన్ని పసిగట్టి ఇమ్యూన్ సిస్టమ్‌ను అలర్ట్ చేస్తుంది. దీంతో టీ కిల్లర్ సెల్స్ తయారై వైరస్‌ను చంపేస్తాయి.
ఒక్క డోసే ఇస్తున్న యూరప్ దేశాలు:
కరోనాను జయించిన వారికి ఒకే డోస్ సరిపోతుందన్న అధ్యయనాలతో ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ తదితర దేశాలు తమ వ్యాక్సినేషన్ వ్యూహాన్ని మార్చుకొని ఒకే డోస్‌తో సరిపెడుతున్నాయి. వైరస్ సోకి, కోలుకున్నవారికి ఒకే డోస్ ఇవ్వాలని ఇజ్రాయెల్ గత ఫిబ్రవరిలోనే నిర్ణయించి, అమలు చేస్తోంది.
భారత్ లోనూ పరిశోధన చేయాల్సిందే:
సెకండ్ వేవ్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న భారత్‌లో పరిశోధనలు చాలా అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. వ్యాక్సిన్ కొరత ఉన్నందున కరోనా వచ్చిపోయిన వాళ్లలో మొదటి డోస్, రెండో డోస్ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. దేశంలో ఇప్పటికే లక్షలమంది రికవర్ అయ్యారు. ఆరోగ్య శాఖ, లేదా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ఈ దిశగా అధ్యయనాలు నిర్వహిస్తే.. కోలుకున్నవారికి ఒకే డోస్ ఇవ్వడం ద్వారా మరింత ఎక్కువమందికి త్వరగా వ్యాక్సిన్ ఇచ్చే ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు.
0 comments:
Post a Comment