రెండో దశలో కరోనా మహమ్మారి శరవేగంతో విస్తరిస్తున్న తరుణంలో రష్యా మరో వ్యాక్సిన్ తీసుకొచ్చినట్టు ప్రకటించింది. కరోనా నివారణకు సంబంధిం సింగిల్ డోస్ స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను ఆమోదించినట్టు వెల్లడించింది. స్పుత్నిక్ ఫ్యామిలీకే చెందిన ఈ సింగిల్-డోస్ 'స్పుత్నిక్ లైట్' విప్లవాత్మకమైందని, 80 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని రష్యా అధికారులు తెలిపారు. రెండు మోతాదుల వ్యాక్సిన్ల కంటే స్పుత్నిక్ లైట్ టీకా చాలా ప్రభావవంతమైందని ప్రకటించారు.రష్యా గమలేయ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ 79.4 శాతం ప్రభావవంతంగా ఉందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్) తాజాగా ప్రకటించింది. స్పుత్నిక్ లైట్ మోతాదుకు10 డాలర్ల కంటే తక్కువ ఖర్చు అవుతుందనీ ఒక ప్రకటనలో తెలిపింది. సామూహిక టీకా కార్యక్రమంలో భాగంగా సింగిల్-డోస్ స్పుత్నిక్ లైట్ టీకా 5 డిసెంబర్ 2020 15 ఏప్రిల్ 2021 మధ్య పరీక్షించామని ఆర్‌డిఐఎఫ్ వెల్లడించింది. ఇంజెక్షన్ ఇచ్చిన తరువాత 28 రోజుల డేటా ప్రకారం ఇది 79.4 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించిందని అధికారికంగా తెలిపింది.
0 comments:
Post a Comment