కష్టకాలంలో ప్రభుత్వ బ్యాంకుల చేయూత
కోవిడ్ చికిత్స కోసం రూ.5 లక్షల వరకూ వ్యక్తిగత రుణాలను పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు (పిఎస్‌బిలు) మంజూరు చేయనున్నాయి. ఎస్‌బిఐ ఈ రుణాలకు చెల్లింపుల కాలవ్యవధిని 5 ఏళ్లు, వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించింది. మిగిలిన బ్యాంకులు తమ వడ్డీ రేటును, కాలవ్యవధిపై తామే నిర్ణయించుకునే అవకాశాన్ని కలిగి ఉన్నాయి. ఖాతాదారులు తమకు, లేదా కుటుంబ సభ్యులకు కోవిడ్ చికిత్స కోసం ఈ రుణాన్ని తీసుకోవచ్చు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఒక సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశాయి. ఈ ప్రకటన ప్రకారం వేతనం, వేతనం లేనివారు, పింఛనుదారులు ఈ రుణాలను రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకూ పొందవచ్చు.
0 comments:
Post a Comment