Corona Medicine: కరోనాపై పోరుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) నేడు అందుబాటులోకి రానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో మొత్తం 10 వేల డోసులు పంపిణీ చేయనున్నారు. పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల..వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్‌డీఓ వివరించింది. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పొడిని తయారు చేసింది.దీనిని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని. భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment