కరోనాపై యుద్ధానికి డీఆర్డీవో శాస్త్రవేత్తలు సిద్ధం చేసిన ఫార్ములా భలే గమ్మత్తయినది. 2DG మందు 'మోసగాడిని మోసంతోనే జయించాలి'' అనే సూత్రంతో పని చేస్తుంది.
ఏ వైరస్ అయినా మానవ శరీరంలోని కణాలతో కలిసి.. వాటిని మోసం చేసి ప్రోటీన్ ను వినియోగించుకుంటూ ఒక్కొక్క వైరస్ పదింతలుగా పెరగటానికి శరీరం నుంచి గ్లూకోజ్ ను వాడుకుంటుంది. గ్లూకోజ్ అణువుల నుంచి వైరస్ కి శక్తి వస్తుంది. ఆ శక్తితో మళ్ళీ వైరస్ పదింతలుగా పెరుగుతున్న క్రమంలో మన రక్తంలోని తెల్లరక్త కణాలు దానిపై పోరాటం చేస్తాయి. పెరిగే వైరస్ ఎక్కువై.. తెల్ల రక్త కణాలు ఓడిపోయినప్పుడు మనిషి మరణిస్తాడు.
తాజా 2DG మందులోని సూడో గ్లూకోజ్ వైరస్ ను మోసం చేసి తాను అచ్చమైన గ్లూకోజ్ అని భావించేలా చేస్తుంది. ఈ మందు అణువులను మింగిన వైరస్ లు వంధ్యమై కొత్త వైరస్ లను పుట్టించలేవు. ఈ సమయంలో తెల్ల రక్త కణాలు మిగిలిన వైరస్ లను నాశనం చేస్తాయి. ప్రస్తుత అంచనా ప్రకారం కొన్ని గంటలలోనే శరీరంలో ప్రవేశించిన కరోనా వైరస్ జీరో అవుతుంది.
ఈ మందు కనుక అనుకున్న విధంగా పని చేస్తే, కరోనా వైరస్ చిన్న జలుబు కంటే చిన్న జబ్బుగా మారిపోతుంది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ లో ఇది అధ్బుతంగా పని చేసింది. జేమ్స్ బాండ్ 007 లాంటి ఈ సృష్టి కేవలం మన భారత శాస్త్రవేత్తలకు మాత్రమే సాధ్యం. నాటి ప్లేగు కాలంలో టెట్రాసైక్లిన్ కనిపెట్టిన యల్లాప్రగడ సుబ్బారావు నుంచి నేటి శాస్త్రవేత్తల వరకు భారతీయ సత్తా ఏమిటో రుజువు చేస్తూనే ఉన్నారు.
0 comments:
Post a Comment