సంవత్సరం మొదటి నుంచి కూడా వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ కి సంబంధించి పలు విషయాలు వినబడుతూనే ఉన్నాయి. ఈ నెల అంటే మే 15 నుండి కొత్త ప్రైవసీ పాలసీ అందుబాటులోకి రానుంది. మూడు నెలల క్రితం రావాల్సిన ప్రైవసీ పాలసీ ఇంకా రాలేదు. తరచుగా వాట్స్ ఆప్ నోటిఫికేషన్స్ ని యూజర్స్ కి పంపిస్తోంది.
ఈ పాలసీ యాక్సెప్ట్ చేయకపోతే మే 15 నాటికి మీ వాట్సప్ బంద్:
ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయాలని…. మే 15 లోగా యాక్సెప్ట్ చేయాలని పలు నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే…? ఏమవుతుంది ఒకవేళ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయకపోతే…? అయితే దగ్గరలోనే వాట్స్ ఆప్ ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేయాలి. కంపెనీ దీనిని పోస్ట్ పోన్ చేసేలా కనపడడం లేదు.ఈ విషయం పై కంపెనీ క్లారిటీగా చెప్పేస్తుంది.మే 15 లోగా ఈ కొత్త ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేయకపోతే వాట్సాప్ నుండి ఎటువంటి మెసేజెస్ రావు అని చెప్పేసింది. కాబట్టి వాట్సప్ ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేసే వరకు కూడా దాన్ని వాడడానికి వీలు లేదు.
ఒకవేళ కనుక 120 రోజుల వరకు కూడా దీనిని యాక్సెప్ట్ చెయ్యక పోతే అప్పుడు ఎకౌంట్ డిలీట్ అయిపోతుంది. భారత దేశంలో చాలా మంది వాట్స్ ఆప్ ని ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త ప్రైవసీ పాలసీని చూసి యూజర్స్ కోపానికి గురయ్యారు.
వాట్సాప్ ఇప్పుడు తన డాటాని చాలా మట్టుకు ఫేస్బుక్ తో షేర్ చేస్తోంది. దీనిని యూరప్ లో ఇంప్లిమెంట్ చేయలేదు. దీనికి వేరేగా ప్రైవసీ లా ఉంది. ఇప్పటికే వాట్సాప్ సమాచారాన్ని ఫేస్బుక్ కి అందిస్తోంది. ఐపి అడ్రస్ వంటివి షేర్ చేసుకోవడం జరిగింది.
0 comments:
Post a Comment