ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి 13లోగా మ్యాపింగ్

13లోగా  మ్యాపింగ్


★ రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి మండలాలవారీగా మ్యాపింగ్ సిద్ధం చేయాలని..


★ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు

జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులనిచ్చారు.


★ ఈ ప్రక్రియను మండల విద్యాధికారులకు అప్పగించాలని సూచించారు.


★ నూతన విద్యావిధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో ఎల్ కేజీ నుంచి తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 


★ అంగన్‌వాడీ కేంద్రాలను అందులోకి తరలించడానికున్న అవకాశాలను

పరిశీలించటానికి మ్యాపింగ్ చేపట్టారు. 


★ ఈ సమాచారాన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారుల సహకారంతో గురువారంలోగా ఎంఈవోలు సేకరించాలని

ఉన్నతాధికారులు సూచించారు.


★ ఇందుకోసం జిల్లా

స్థాయిలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటుచేసి ఎంఈవోలకు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.


★ కొవిడ్ కారణంగా ఎంఈవోలు ఐసొలేషన్లో ఉంటే ప్రత్యామ్నాయంగా సీనియర్ ఉద్యోగికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top