పదో తరగతి పరీక్షల సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది పరీక్షలను ఏడు పేపర్లుగా నిర్వహిస్తున్నారు. వంద మార్కులకు నిర్వహించే తెలుగు, ఆంగ్లం, హిందీ, గణితం, సాంఘిక శాస్త్రం పరీక్షలకు సమయం 3.15గంటలు ఉంటుంది. మూడు గంటలు పరీక్ష రాసేందుకు, 15నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకునేందుకు ఇస్తారు. సామాన్య శాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు పేపర్-1 (50మార్కులు), జీవశాస్త్రం పేపర్-2 (50మార్కులు)గా ఇస్తారు. దీనికి గతంలోలాగే 2.45గంటలు సమయం ఉంటుంది. కాంపొజిట్ కోర్సు పేపర్-2కు 1.45గంటలు, ప్రధాన భాష సబ్జెక్టులకు 3.15గంటలు, వృత్తి విద్యా కోర్సులకు 2 గంటల సమయం ఉంటుంది.
DGE instructions on SSC Examinations
0 comments:
Post a Comment