ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు
★ ఆదర్శ విద్యాలయాల్లో 2021-22 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఇప్పటికే ప్రకటన వెలువడింది.ఆదర్శ పాఠశాలల్లో మే 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
★ అయితే నిరుడు మాదిరిగానే కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దుచేసి లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
★ ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు, ఐదు తరగతులు చదివిన విద్యార్థులు ఈ ప్రవేశానికి అర్హులు.
★ దరఖాస్తుకు ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2009 నుంచి 31.08.2011 మధ్య జన్మించి ఉండాలి.
★ ఫీజు రూ.100, ఎస్సీ, ఎస్టీలు 1.9.2007 నుంచి 31.8.2011 మధ్య జన్మించి ఉండాలి. ఫీజు రూ.50. ఏపీ ఆన్‌లైన్ మీసేవ కేంద్రంలో చెల్లించాలి.
★ 6వ తరగతి ప్రవేశం కోరే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో 2019-20, 2020-21 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి.
★ దరఖాస్తు కొరకు సీఎస్‌ఈ.ఏసీ.జీవోవి.ఇన్/ఏపీఎంఎస్.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్‌సైట్‌లో చూడవచ్ఛు
ఇంటర్ వరకు ఉచిత విద్య
ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశానికి మే 15 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
★ ఏరాన్‌లైన్ లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని దాన్ని ప్రింట్ తీసుకుని ఆదర్శ పాఠశాలల్లో ఇవ్వాలి. ఆధార్, కుల, ఆదాయ తదితర పత్రాలను దరఖాస్తుతో జతపరచాలి.
★ లాటరీ ద్వారా ప్రవేశాలు రిజర్వేషన్ ప్రకారం ఉంటాయి. 6వ తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్ వరకు ఉచితంగా విద్య అందుతుంది. ఇది చక్కని అవకాశం.
0 comments:
Post a Comment