జగన్నన్న స్మార్ట్ టౌన్
ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్హులే.ఆదాయ ధృవీకరణ కొరకు ఫారమ్ 16 సమర్పించాలి
సొంతింటి కలను సకారం చేసే దిశగా 'జగనన్న స్మార్ట్ టౌన్' పేరుతో ఇళ్ల స్థలాలను మంజూరు చేసే సదవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ "ప్రసన్న వెంకటేష్"సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి ఆదాయ వర్గాల వారికి సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. నగరపాలక సంస్థ పరిధి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసి సరసమైన ధరలకు ఇళ్ల స్థలాలను అందిస్తామన్నారు. ఈ స్మార్ట్ టౌన్ పరిధిలో విశాలమైన రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ, వీధిదీపాల ఏర్పాటు, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇందుకుగాను ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేస్తామన్నారు.
కమ్యూనిటీ హాలు, పాఠశాల భవనం, ఆరోగ్య కేంద్రం, షాపింగ్ సెంటర్, బ్యాంక్, వార్డు సచివాలయం, అంగన్‌వాడీ కేంద్రం, మార్కెట్, వాకింగ్ ట్రాక్, పిల్లల ఆటస్థలం తదితరాల వాటికి స్థలం కేటాయిస్తామన్నారు. నీటి సరఫరా, ఓవర్‌హెడ్ ట్యాంక్, విద్యుత్ సబ్‌స్టేషన్, ప్లాంటేషన్, సోలార్ ప్యానెల్స్ వంటి సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. మూడు లక్షల నుంచి రూ.18 లక్షలలోపు సంవత్సరాదాయం కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పథకానికి అర్హులేనన్నారు. 150 చదరపు గజాలకు (మూడు సెంట్లు) సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి రూ.3 లక్షల నుండి రూ.6 లక్షలు, 200 చదరపు గజాలకు (4 సెంట్లు) సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షలు, 240 చదరపు గజాలకు (ఐదు సెంట్లు) సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి రూ.12 లక్షల నుంచి 18 లక్షల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. దీనిలో భాగంగా సచివాలయ సిబ్బంది ఈనెల 6,7 తేదీల్లో డిమాండ్ సర్వే నిర్వహిస్తున్నందున అర్హులైన నగర వాసులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
MIG లేఅవుట్ సర్వే
అర్హతలు
1) రేషన్ కార్డు ఉండకూడదు
2) టిడ్కో గృహం లబ్ధిదారులు అయి ఉండకూడదు
3) జగనన్న పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులు అయి ఉండకూడదు
4) సొంత ఇల్లు కలిగి ఉండకూడదు
గౌరవ కమిషనర్ గారి ఆదేశాలు మేరకు ప్రభుత్వం నిర్ణయించిన సదరు స్థలం యొక్క రుసుము ను సింగిల్ పేమెంట్ లో చెల్లించాల్సి ఉంటుంది.
మీకు కేటాయించిన స్థలం లో మీరు ఇల్లు నిర్మాణం కూడా చెప్పటల్సి ఉంటుంది. కావున అందరూ ఈ విషయం నీ తెలిపి ఇందుకు అంగీకారం తెలిపిన వారి వివరములు గూగుల్ షీట్ లో ఫిల్ చేసి మరియు సదరు అప్లికేషన్ ఫామ్ ను సచివాలయం నుండి తీసుకొని సదరు వ్యక్తి యొక్క వివరములు నింపి,వారి యొక్క సంతకం తీసుకుని మరియు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని జత చేయవలసిందిగా కోరుచున్నాము
®️దీనికి సంబదించిన , గౌరవ కమిషనర్ గారి తదుపరి ఉత్తరవులు/ఆదేశములు రాగానే మీకు తెలియజేస్తాము.
0 comments:
Post a Comment