రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు అందరికీ డిజిటల్ హెల్త్కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది అందుకు అనుగుణంగా వారి వివరాలు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. చాలామంది ఉద్యోగులు, పెన్షనర్లు వారి యొక్క వివరాలు అప్డేట్ చేసుకున్నారు ప్రస్తుతం క్యూ ఆర్ కోడ్ తో కూడిన హెల్త్ కార్డులు అందుబాటులో కలవు. వ్యక్తిగతంగా మీ లాగిన్ లో నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డౌన్లోడ్ చేసుకునే ముందు వివరాలు సరిచూసుకొని డౌన్లోడ్ చేసుకోగలరు. హెల్త్ కార్డు లో ఏమైనా తప్పులు ఉన్న ఎడల వాటిని సరిచేసుకునే అవకాశం కలదు ప్రస్తుతానికి పేరు, జెండర్, మొబైల్ నెంబర్, బ్లడ్ గ్రూపు రిలేషన్, ఫోటో మాత్రమే సరి చేసుకోవడానికి అవకాశం కలదు.
0 comments:
Post a Comment