Covid 19: కరోనా రోగులకు కేంద్రం మార్గదర్శకాలు


Covid 19:  కరోనా రోగులకు కేంద్రం మార్గదర్శకాలు:

* ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్న మధ్యస్థాయి/లక్షణాలు లేని వారు రెమ్ డెసివిర్‌ ఔషధాన్ని వాడొద్దు. ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న రోగులు మాత్రమే దీన్ని తీసుకోవాలి.

* నోటి ద్వారా ఎలాంటి స్టెరాయిడ్లు తీసుకోకూడదు. ఏడు రోజులు దాటిన తర్వాత కూడా జ్వరం, దగ్గు ఉంటే వైద్యుల సూచనల మేరకే కొంత మోతాదులో వీటిని వాడాలి.

* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గడం వంటి సమస్యలు ఉన్నవాళ్లు వెంటనే ఆసుపత్రిలో చేరాలి. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాళ్లు చికిత్స తీసుకోవాలి.


* రోగులు గోరు వెచ్చని నీటిని పుక్కిలించడం చేయాలి. రోజుకు కనీసం రెండుసార్లు ఆవిరి పట్టాలి.

* పారాసిటమాల్‌ 650 ఎంజీ రోజుకు నాలుగు సార్లు వేసుకున్నప్పటికీ, జ్వరం తగ్గకపోతే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

* రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి నాన్‌-స్టెరాయిడ్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్‌-ఎన్‌ఎస్‌ఏఐడీ (ఉదాహరణకు రోజుకు రెండుసార్లు నాప్రోక్సెన్‌ 250 ఎంజీ)ను వైద్యులు సూచించవచ్చు.

* అలాగే, ఐవర్‌మెక్‌టిన్‌ (ఖాళీ కడుపుతో వేసుకునేది) ట్యాబ్లెట్లను 3 నుంచి 5 రోజులు వాడేందుకు అనుమతి ఇవ్వొచ్చు.


* ఐదు రోజుల పాటు జ్వరం, దగ్గు ఉంటే ఇన్‌హెలేషనల్‌ బ్యూడెసనైడ్‌ (ఇన్‌హేలర్‌ ద్వారా తీసుకునే మందు) ను రోజుకు రెండుసార్లు వైద్యులు సూచించవచ్చు.

* కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేకపోవడం, 94 శాతానికి పైన ఆక్సిజన్‌ స్థాయిలు ఉండటం, జ్వరం వంటివి లేకపోతే వారిని లక్షణాలు లేనివారిగా గుర్తించాలి. వైద్యుల సూచన మేరకు వాళ్లు మందులు వేసుకోవాలి. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి.

* మధ్య స్థాయి లక్షణాలు కలిగిన వారు, లక్షణాలు లేని వారు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు వాడొచ్చు. హోం ఐసోలేషన్‌లో ప్రత్యేకంగా కేటాయించిన గదిలో ఉండటం మేలు. కుటుంబ సభ్యులకు ముఖ్యంగా వృద్ధులకు దూరంగా ఉండాలి.


* హోంఐసోలేషన్‌లో ఉన్నవారు గదిలో గాలి, వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలి. మాస్క్‌ ధరించే ఉండాలి.

* హోంఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆహారం అందించే వ్యక్తులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ఇరువురూ ఎన్‌-95 మాస్క్‌ ధరిస్తే మంచిది.

* రోగి వాడిన మాస్క్‌లను సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంలో శుద్ధి చేసిన తర్వాతే పారేయాలి.

* కరోనా బారిన పడినవారు వీలైనంత ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలి. శరీరం తేమను కోల్పోకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. వారు వినియోగించిన వస్తువులను ఇతరులు వాడొద్దు.

* హోంఐసోలేషన్‌ వ్యవధి పూర్తయిన తర్వాత ఇంకోసారి కరోనా పరీక్షలు అవసరం లేదు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top