ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ తెదేపా, భాజపా, జనసేన వేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు కావాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment