తీవ్ర వడగాలులు
★ ఏప్రిల్ ప్రారంభంలోనే వేసవి ఠారెత్తిస్తోంది. విజయవాడతో సహా రాష్ట్రంలోని 7 జిల్లాల్లో శుక్రవారం తీవ్ర వడగాలులు నమోదయ్యాయి.
★ మరో 180 మండలాల్లో వడగాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది.
★ తూర్పుగోదావరి జిల్లాలోని 4 మండలాలు,
★ పశ్చిమగోదావరి 15,
★ కృష్ణా 9,
★ గుంటూరు 11,
★ ప్రకాశం 8,
★ నెల్లూరు 3,
★ చిత్తూరు 2 మండలాల్లో.. మొత్తంగా 52 మండలాల్లో వడగాలులు ఎక్కువగా ఉన్నాయి.
★ ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రతలకన్నా దాదాపు 7డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
★ అనంతపురం మినహా 12 జిల్లాల్లోని 180 మండలాల్లో వడగాలులు వీచాయని వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది.
★ ఇక్కడ సాధారణంకన్నా 5, 6 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
★ రాబోయే 2రోజుల్లో వడగాలుల ఉద్ధృతి తగ్గనుందన్న సూచనలున్నాయి.
★ శనివారం రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 19 మండలాల్లో మాత్రమే వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది
0 comments:
Post a Comment