నేటి డిజిటల్ కాలంలో ఫోన్ నంబర్, దానికి వచ్చే వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) ఎంత కీలకమే అందరికీ తెల్సిందే. ఆ విషయాల్లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు. అయితే గతంలో ప్రస్తుత కాలంలో చాలా మందికి ఒక పర్మనెంట్ నెంబర్ ఉండగా… ఆఫీస్ అవసరాలకు లేదా ఇతర సౌకర్యాలకు అనుగుణంగా నెంబర్లు తీసుకొని వాటిని వాడడం మానేస్తూ ఉంటారు. అయితే మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో చాలా మందికి తెలియదు.అలానే మనకు తెలియకుండానే ,మన అడ్రస్ ప్రూఫ్ మీద ఎవరైనా దొంగ సిమ్ తీసుకున్నారో కూడా తెలియదు. ఎవరైనా మన పేరు మీద సిమ్ తీసుకొని వాటిని మిస్ యూజ్ చేస్తే చిక్కుల్లో పడేది మాత్రం మనదే. మరి అలాంటివి జరగకుండా మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మీ పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయో తెలుసుకోండిలా.....
అయితే ఇలా మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకునేలా విజయవాడ టెలికాం విభాగం వీలు కల్పించింది. దీని ద్వారా మన పేరు మీద ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో తెలుసుకోవడమే కాకుండా.. మనవి కాని నెంబర్లపై రిపోర్టు కూడా చేసే అవకాశం ఉంది. అలా రిపోర్టు చేసిన నంబర్లపై చర్యలు తీసుకుంటామని విజయవాడ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాబర్ట్ రవి తెలిపారు. అయితే ఈ సేవలు ఏపీ, తెలంగాణ టెలికం సర్కిల్‌లోనే అందుబాటులో ఉండగా… త్వరలోనే దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నారు. అయితే ఒక్క వ్యక్తి పేరు మీద గరిష్ఠంగా 9 ఫోన్ నంబర్లు మాత్రమే ఉండేందుకు వీలుందని ఆయన స్పష్టం చేసారు.
మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుగా http://tafcop.dgtelecom.gov.in/ వెబ్‌సైట్ కి వెళ్ళాలి. అక్కడ మన ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయగానే వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కగానే మన పేరు మీద ఉన్న ఫోన్ నంబర్ల వివరాలు వస్తాయి. ప్రతి నంబర్ వద్ద ఇది నా నంబర్ కాదు, నా నంబరే కానీ ప్రస్తుతం ఉపయోగించడం లేదు అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ఒకటి సెలెక్ట్ చేసి సబ్‌మిట్ చేస్తే టెలికం శాఖకు రిపోర్ట్ వెళ్తుంది. దీంతో ఆయా నంబర్లపై టెలికం శాఖ చర్యలు తీసుకుంటుంది
0 comments:
Post a Comment