రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగానే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పరీక్షల రద్దుతో గతేడాది మిలిటరీ ఉద్యోగార్థులు నష్టపోయారన్నారు.
పాఠశాలల్లో ఇప్పటి వరకు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించామని మంత్రి చెప్పారు.
పరీక్షల నిర్వహణ సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు ఇక ఎలాంటి పరీక్షలు ఉండవని.. ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తయినట్లు మంత్రి సురేశ్ స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment