కరోనా టీకా కోసం మూడు గంటల్లో సుమారు 80 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మే 1 నుంచి కరోనా వ్యాక్సినేషన్ మూడో దశ దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నది. ఇందులో భాగంగా 18-44 ఏండ్ల వారికీ టీకా వేస్తారు. అయితే కొవిన్ వెబ్ , ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం బుధవారం సాయంత్రం 4 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. అయితే దేశవ్యాప్తంగా లక్షల్లో తమ పేరు నమోదుకు ప్రయత్నించడంతో తొలుత కొవిన్ సర్వర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో తర్వాత ప్రయత్నించండి అని కనిపించింది.
అయితే కొంత సేపటికి సమస్యను పరిష్కరించారు. అనంతరం సెకండ్‌కు 55 వేల హిట్స్, నిమిషానికి 27 లక్షల మంది రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులలోని టీకా కేంద్రాల వద్ద వ్యాక్సిన్లు అందుబాటు ఆధారంగా రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పారు. త్వరలో మరిన్ని స్లాట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. స్లాట్లు అందుబాటులో లేకపోతే మరోసారి తిరిగి ప్రయత్నించాలని, పరిస్థితిని అర్థం చేసుకుని సహనంతో ఉండాలని ప్రజలకు సూచించారు
0 comments:
Post a Comment