పదో తరగతి అర్హతతో 50 వేల ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్

 దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ)-2021 జాబ్‌ నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలో విడుదల చేయనుంది. గత నెల 25వ తేదీనే ఈ షెడ్యూల్ విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఈ షెడ్యూల్ వాయిదా పడింది.

షెడ్యూల్ కు సంబంధించిన పనులు పూర్తి చేసి ఈ నెల చివరి వారం లేదా మే నెల మొదటి వారంలో షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్టు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌ లో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలను చేపట్టనుంది.

పదోతరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాలకు మే నెల 10వ తేదీన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందని సమాచారం. ఈ ఉద్యోగాలకు ఆగష్టు నెల 2వ తేదీ నుంచి ఆగష్టు నెల 25వ తేదీ వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షతో పాటు ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్ష ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలుస్తోంది.


మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరగనుందని సమాచారం. https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రిపరేషన్ ను మొదలుపెడితే మంచిది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top