పది, ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు చేయాలన్న పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. కరోనాతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం అని తెలిపింది. పక్క రాష్ట్రాల్లో వాయిదా వేస్తే మీరెలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది.
0 comments:
Post a Comment