Pradhan Mantri Jan Dhan Yojana: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోదారులకు పలు బెనిఫిట్స్ అందిస్తోంది. తాజాగా ఈ సంస్థ తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకంలో భాగంగా అకౌంట్స్ ఓపెన్స్ చేసిన వారికి ఈ సౌకర్యాలు లభిస్తాయి. మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉంటే ఇది మీకు శుభవార్త అనే చెప్పుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉండి.. అక్కడే జన్ ధన్ ఖాతా తెరిచినట్లయితే మీరు లక్షాధికారులు అయినట్టే. అదేలా అని ఆలోచిస్తున్నారా. అయితే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే. (jandhan khata)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన జన్ ధన్ ఖాతాదారులకు రూ.2 లక్షల వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన జన్ ధన్ ఖాతాదారులకు రూ.2 లక్షల వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది.ఈ విషయాన్ని ఎస్బీఐ తన వినియోగదారులకు ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ఎస్బీఐ రూపయ్ జన్ ధన్ కార్డును జన్ ధన్ ఖాతాదారులకు అందిస్తోంది. ఈ కార్డులో వినియోగదారులను రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ సౌకర్యం అందిస్తోంది. రూపే కార్డ్ మీ ఎటిఎం లాగా పనిచేస్తుంది. దీని సహయంతో మీ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చు. అలాగే షాపింగ్స్ కూడా చేయోచ్చు.
ఎస్పీఐ రూపే జనధన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే మీకు రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ లభిస్తుందని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది ఎస్బీఐ. అలాగే రూపే కార్డు సౌకర్యాలను వినియోగదారులను ఉచితంగా ఇస్తుంది.
0 comments:
Post a Comment