మే 1 నుంచి 31 వరకు పదవ తరగతి వారికి వేసవి సెలవులు.

మే 1 నుంచి 31 వరకు పదవ తరగతి వారికి వేసవి సెలవులు.


ఈ నెల 30కి జూనియర్ కళాశాలలు, పదవతరగతి వారికి లాస్ట్ వర్కింగ్ డే


షెడ్యూల్ మేరకు జూన్ 7వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు

 covid 19 రెండవ దశ  ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో... పదవ తరగతి వారికి సిలబస్ మొత్తం పూర్తయిన నేపథ్యంలో... మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్ నేడిక్కడ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలులో సోమవారం మధ్యాహ్నం జిల్లాలో covid 19 రెండవదశ ప్రబలకుండా తీసుకోవలసిన నివారణ చర్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశం అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ... కోవిడ్ వ్యాప్తిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా కూడా విద్యాలయాల గురించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందులో భాగంగానే పదవ తరగతి వారికి సిలబస్ మొత్తం పూర్తయిన నేపథ్యంలో మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులు ప్రకటించడం జరిగిందన్నారు జూన్ ఒకటవ తేదీనుంచి టీచర్లు బడికి వచ్చి షెడ్యూల్ మేరకు జూన్ 7వ తేదీ నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు సిద్ధం కావాలని కోరుతున్నామన్నారు. అలాగే ఈనెల 30 కి జూనియర్ కళాశాలలకు, టెన్త్ క్లాస్ పిల్లలకు లాస్ట్ వర్కింగ్ డే అవుతుందన్నారు. సెలవుల్లో ఇంటి పట్టునే ఉండి విద్యార్థులందరూ పరీక్షలకు బాగా ప్రిపేర్ కావాలని మంత్రి సూచించారు. కోవిడ్ కు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల  రక్షణ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాబట్టి ఇంతకుముందు ఆన్లైన్ క్లాస్ వర్క్ ఏదైతే ఉందో అది కూడా అవసరం మేరకు విద్యామృతం, విద్య కలశం లను పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు దోహదపడే విధంగా ఆన్లైన్ క్లాసులు కొనసాగిస్తామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top