రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, సచివాలయ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వాభీష్టానికి అనుగుణంగా పనిచేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి పీఆర్‌సీ అమల్లో జాప్యం జరుగుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి అక్కడి ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిందని గుర్తుచేశారు. ఇంతకంటే ఎక్కువగా సీఎం జగన్ ప్రకటిస్తారన్న ఆశతో ఉద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెబుతారని ఆశిస్తున్నామన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment