జీతాల బిల్లులో అడ్వాన్స్ టాక్స్ డిడక్షషన్స్ ప్రతి నెల చేయాలి
®DDO(MEO/HM)లు ప్రతి నెల తమ పరిధిలోని employees /Teachers నెల జీతము నుండి అడ్వాన్స్ టాక్స్ డిడక్షషన్స్ తప్పక చేయాలి.
గత ఆర్ధిక సంవత్సరము 2020-21లో చెల్లించిన ఆదాయపు పన్ను మొత్తము +10% Excess (Rounded to hundred)ను 12 తో భాగించగా వచ్చిన మొత్తమును ప్రతినెల జీతము బిల్లులో మినహాయించాలి. జనవరి & ఫిబ్రవరి దాకా ఆగరాదు.
అలా చివరి క్వార్టర్ దాకా TDS మినహాయించకపోతే, నూతన చట్టము ప్రకారము చివరి క్వార్టర్ లో ఎంత Tax చెల్లిస్తారో అంతమొత్తము DDO లకు పెనాల్టీ గా వేయబడును. కావున మార్చి 2021 నెల జీతాల నుండే 2021--22 FY కు IT deduction ను నిర్బంధంగా ప్రారంభించాలి. Employee Willing తో పనిలేదు. గత సంవత్సరము 2020-21 FY లో Deduct చేసిన IT+10% ను 12 installments లో deduct చేయుటకు అవసరమైన Deduction Proceedings ను ఇచ్చి employees notice కు తేవాలి.
ప్రతి నెల/ Quarter లో Employees అందరి పేర్లతో IT deduction Schedule ఉండాలి. *DDOలు విధిగా TDS చేయాలి.* ఆలస్యమైతే రోజుకు రు200.00ల చొప్పున పెనాల్టీ వేయబడును. ఇప్పటికే మన జిల్లాలో 350 మందికి పైగా DDO లకు గత TDS delay పై లక్షలాది రూపాయల పెనాల్టీ నోటీసులు వచ్చినవి. ఈ పెనాల్టీలకు Exemption లు లేవు.
జనవరి & ఫిబ్రవరి 2022 లలో IT compute చేసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే ఆ నెలలలో మినహాయింపులు చేయవచ్చును.®
TDS చేయడం MEO/HM లదే బాధ్యత
e-filing చేయడం టీచర్ ల బాధ్యత
0 comments:
Post a Comment