200 మంది ప్రధానోపాధ్యాయులకు తాఖీదుల
జిల్లాలోని 200 మంది ప్రధానోపాధ్యాయులకు గురువారం విద్యాశాఖ తాఖీదులిచ్చింది.
సంయుక్త కలెక్టర్ సాయికాంత్‌వర్మ ఆదేశాల మేరకు డీఈవో శైలజ ఉత్తర్వులు జారీ చేశారు. ‘జగనన్న గోరుముద్ద’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అందించే మధ్యాహ్నభోజన పథకాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ ఆఫ్ మిడ్‌డే మీల్స్ అండ్ స్కూల్ శానిటేషన్ (ఐఎంఎంఎస్) యాప్‌ను రూపొందించి అమలు చేస్తోంది. దీని ప్రకారం రోజూ మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు, విద్యార్థులకు అందిస్తున్న విధానం, ఎవరైనా అధికారులు తనిఖీ చేయడం తదితర చిత్రాలను ఆ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
గత రెండు నెలలుగా కార్యక్రమం అమలుపై రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఆ యాప్‌లో పర్యవేక్షణ చేయని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ గుర్తించింది. ఫలితంగా మొత్తం 200 మందికి తాఖీదులందించింది.
ఈ విషయమై డీఈవో మాట్లాడుతూ ‘జగనన్న గోరుముద్ద’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేవిధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఒక్కసారి కూడా ఐఎంఎంఎస్ యాప్‌లో పరిశీలన వివరాలను అప్‌లోడ్ చేయని 200 మంది ప్రధానోపాధ్యాయులకు సంయుక్త కలెక్టర్ ఆదేశాల మేరకు తాఖీదులు ఇచ్చామని వివరించారు.
0 comments:
Post a Comment