(ఆంధ్ర టీచర్స్) ఎస్సార్ సబ్ ట్రెజరీ స్థాయిలు వెరిఫికేషన్ చేసే సమయంలో ఈ క్రింది అంశాలు చెక్ చేస్తారు కావున ఉపాధ్యాయులు ఉద్యోగులు వీటిని పరిశీలించుకుంటే మంచిది
1. ఉద్యోగి పేరు ఎస్ ఆర్ నందు ఏ విధంగా నమోదు కాబడి ఉన్నది.
2. ఉద్యోగి పుట్టిన తేదీ
3. సర్వీసులో చేరిన తేదీ
4. ఉద్యోగి కులము
5. ఉద్యోగి విభిన్న ప్రతిభావంతుల తరగతులకు చెందిన వాడా
6. ఉద్యోగి ఆఖరు మూల వేతనం ఫ్లై లీఫ్ ఆధారంగా క్రాస్ చెక్ చేస్తారు
7. ఉద్యోగి ఎస్ ఆర్ అప్లోడ్ చేసే నాటికి అతని ఖాతాలో ఉన్న సంపాదిత సెలవు మొత్తం ఎంత అనేది పరిశీలిస్తారు
8. అర్ధ వేతన సెలవు అప్లోడ్ చేసే నాటికి అతని ఖాతాలో ఉన్న మొత్తమును పరిశీలిస్తారు
ఆ వివరాలన్నీ యు ట్రెజరీ అధికారి పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత అతను బయోమెట్రిక్ ఆధారంగా ధృవీకరించారు అప్పుడు మాత్రమే ఉద్యోగులకు సంబంధించిన వివరాలు HCM ప్యాకేజీ లోకి మారతాయి
0 comments:
Post a Comment