డీఎస్సీపై త్వరలోనే నిర్ణయం: ఏపీ విద్యాశాఖ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు, రాష్ట్ర స్థాయి విద్యకు ప్రాధాన్యత ఇస్తూనే సీబీఎస్‌ఈ విధానం అమలు చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ వెల్లడించింది.
మెగా డీఎస్సీ, డీఎస్సీ, టెట్ నిర్వహణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
గత మూడు నెలలుగా ప్రభుత్వ బడులను తనిఖీ చేస్తున్నట్లు పేర్కొంది. గతేడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారని వెల్లడించింది.
ప్రైవేటుకు మించి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని వివరించింది. ఇప్పటికే 45 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని.. కొత్తగా మరో 5 లక్షల మంది చేరినట్లు విద్యాశాఖ వెల్లడించింది.
ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. దీనికి అనుగుణంగా ఏటా సెప్టెంబరులో 5 శాతం అదనంగా పాఠ్య పుస్తకాలను ముద్రిస్తామని విద్యాశాఖ పేర్కొంది
0 comments:
Post a Comment