ఉపాధ్యాయులు కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. తొలిదశలో 45 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులకు అవకాశం కల్పిస్తోంది. మండలాల వారీ వ్యాక్సిన్ కేంద్రాలను వైద్యారోగ్యశాఖ ఇప్పటికే ఏర్పాటు చేసింది. 45 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన జిల్లాల విద్యాశాఖ అధికారులు కూడా మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల చేసే ఆవకాశం ఉంది. పాఠశాలల్లో 45 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు ఎంత మంది ఉన్నారనే జాబితాను ప్రధానోపాధ్యాయులు సిద్ధం చేస్తున్నారు. ఈ జాబితా వైద్యారోగ్య శాఖకు వెళ్తుంది. ఈ జాబితా ప్రకారం టీచర్లకు వ్యాక్సిన్ అందనుంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment