భారతదేశ కొత్త వేతన నియమాలు రేపు అమల్లోకి రావడం లేదు. చాలా మంది ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న జీతాల స్ట్రక్చర్ నే అమలు చేయనున్నామని.. రేపటి నుంచి అమలు చేయాలనుకుంటున్న శాలరీ స్ట్రక్చర్ ను మార్చే కొత్త వేతన కోడ్ వాయిదా వేశామని కార్మిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి చెప్పారు
ఈ కొత్త వేతన కోడ్ అమలు వాయిదా వేయడంతో పలు పరిశ్రమ నిపుణులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కొత్త చట్టం అమలు చేయడం కోసం వేలాది కంపీనీ తమ ఉద్యోగుల కోసం కొత్త పరిహార నిర్మాణాన్ని రూపొందించడానికి కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్తవేతనా చట్టం వాయిదా వేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని పలువురు నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
0 comments:
Post a Comment