విద్యాశాఖ అధికారుల ఆకస్మిక పర్యటన
గుంటూరు జిల్లాలో 2200 మందికి పైగా విద్యార్ధులు ఉన్న పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యా కమీషనర్ శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడి IAS గారు,సర్వశిక్షఅభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ వెర్టిసెల్వి IAS మేడమ్ గారు,రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్రీ రవీంధ్రనాధ్ రెడ్డి,జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఆర్.యస్.గంగభవానీ మేడమ్ గారి ఆకస్మిక పర్యటనలో భాగంగా మన మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విచ్చేశారు. వస్తు వస్తునే పదవ తరగతి గదిలోకి వెళ్ళి విద్యార్ధులను పలకరించి వారు చదువుతున్న ఇంగ్లీష్ మిడియం సోషల్ స్టడీస్ పుస్తకం చదవమని ఓ విద్యార్ధిని అడిగారు....ఆ విద్యార్ధి చక్కగా చదివి,దాని గురించి కమీషనర్ గారికీ వివరించి చెప్పాడు....విద్యార్ధి ని అభినందించి,మరో విద్యార్ధిని పుస్తకం చదవమని అడిగారు...,ఆ విద్యార్ధి కుడా చక్కగా చదివి కమీషనర్ గారిచే అభినందనలు గ్రహించారు..
మీకు ఇష్టమైన ఉపాధ్యాయులు పేరు చెప్పండి అన్న కమీషనర్ గారి ప్రశ్నకు విద్యార్ధులు కళ్ళలో మెరుపులతో.....చిరుధరహాసంతో తమకు నచ్చిన ఉపాధ్యాయుల పేర్లు గట్టగా చెప్పారు.....ఆశ్చర్యపోయిన కమీషనర్ గారు వారి గురువులను పిలిచి ప్రత్యేకంగా అభినందించారు..
ఆరోతరగతి విద్యార్ధులను వారి పుస్తకాలు చదివించి ,వారిని అభినందించారు...విద్యాశాఖ ఉన్నతాధికారుల ప్రశ్నలకు చక్కని సమాధానలు చెప్పి మంచి విద్యార్ధూలుగా పేరు తెచ్చుకున్నారు.విద్యార్ధులకు ఇష్టమైన గురువుల పేర్లు అడిగి వారిని కలిసి అభినందించారు....మీలాంటి గురువుల వలన ప్రభుత్వ పాఠశాలలు బాగుంటున్నాయి..విద్యార్ధుల మనస్సులో మంచి స్ధానం సంపాధించారు..అభినందనలు అని వారిని కొణియాడారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి లింగాల ధనలక్ష్మి మేడమ్ గారు,అధికారులకు "మనబడి నాడు నేడు"కార్యక్రమం ద్వార పాఠశాలలో జరిగిన అభివృధ్ధి కార్యక్రమాలు గురించి వివరించారు.పాఠశాలలో జరిగే కార్యక్రమాలు ,విద్యార్ధూల అభివృధ్ధికి సంబంధించి అన్ని వివరాలను తెలియజేశారు.గౌరవ కమీషనర్ గారు పాఠశాల అభివృధ్ధికి ఏమి కావాలో తెలియజేస్తే వాటిని ఏర్పాటు చేసి ఈ పాఠశాలనూ మోడల్ పాఠశాలగా తిర్చిదిద్దుదాం అని తెలియజేశారు.కాసేపు పాఠశాలలో దాతల సహాకరంతో ఏర్పాటు చేసిన బుద్దుని విగ్రహం ముందు కూర్చోని పాఠశాలలో చక్కని వసతులు ,ఉపాధ్యాయులు ఉన్నారని,చక్కగా పనిచేయలనీ అందరిని అభినందించారు.
ప్రదానోపాధ్యాయురాలు శ్రీమతి ధనలక్ష్మి మేడమ్ గారితో మాట్లడుతు "మీరు పోలీస్ అన్న గాని,ఆర్మీలో నైన గాని ఉండాల్సిన వారు "అని ఓ అధ్భతమైన కాంఫ్లీమెంట్ గౌరవనీయులైన కమీషనర్ గారు .ఇచ్చారు.నిజమే లక్షల రూపాయాల నాడు.నేడు డబ్బులను నిజాయితీగా పాఠశాల కోసమే ఖర్చు చేసి,పాఠశాల రూపురేఖలు మార్చివేశారు.తన సొంత ఖర్చులతో లాక్ డౌన్ సమయంలో పాఠశాలకు వచ్చి విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సౌకర్యాలను దగ్గరుండి అందించారు..
అందుకేనేమో వారికి ఈ చక్కనీ ప్రశంస..,మొత్తం మిద విద్యాశాఖ ఉన్నతాధికారుల మనస్సు దోచుకున్న మన పాఠశాల విద్యార్ధులకు,అభినందనలు ఆశీస్సులు...
0 comments:
Post a Comment