వారం వ్యవధిలో 76 మంది విద్యార్థులకు వైరస్
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. వారం రోజుల వ్యవధిలో 76 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇటీవల విశాఖపట్నంలోని గోపాలపట్నం పాఠశాలలో నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ రాగా, తిరుమల వేద పాఠశాలలో 60 మందికి తూర్పుగోదావరి జిల్లా మలికిపురం ఉన్నత పాఠశాలలో మందికి పాజిటివ్ రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాలల ప్రారంభంలో ప్రభుత్వం చెప్పిన నిబంధనలను ఎవరూ పాటించడం లేదు. టీకా అందుబాటులో ఉండటంతో మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
🌻కరోనా కారణంగా ఈ ఏడాది నవంబరు నుంచి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను ప్రారంభించారు. గదికి 16మంది కంటే ఎక్కువగా ఉండకూడదని, పాఠశాలలకు తరలించే వాహనాల్లో సగం సీట్లలోనే విద్యార్థులు కూర్చోవాలని, కచ్చితంగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. రోజు తప్పించి రోజు తరగతులు నిర్వహించాలని, వంద మంది విద్యార్థులకు ఒక పారిశు ధ్య కార్మికున్ని నియమించుకోవాలని ఆదేశించింది కరోనా కట్టడయ్యే వరకూ విద్యార్ధులను ఆటలకు దూరంగా ఉంచాలని, ప్రతిరోజూ పాఠశాలల్లో ఒక పీరియడ్ కరోనా పై అవగాహనకు వినియోగించాలని సూచించింది. ప్రారంభంలో కొన్ని విషయాలను పాటించిన పాఠశాలలు తరువాత వాటిని విస్తరించాయి. స్కూల్స్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిచేతులు దులిపేసుకున్నాయి. ఫలితంగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 11.38 లక్షల మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం 1602 మంది వ్యాధి బారిన పడినట్లు నిర్ధారించింది. పశ్చిమగోదావరిలో 435 మందికి, గుంటూరులో 259, చిత్తూరులో 253 తూర్పుగోదావరిలో 222, ప్రకాశంలో 145, కడపలో 135, కృష్ణాలో 102, విశాఖపట్నంలో 112 అనంతపురంలో 88, కర్నూలులో 83, శ్రీకాకుళంలో 78, నెల్లూరులో 72, విజయనగరంలో 23 మంది విద్యార్థులు వ్యాధి బారిన పడినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వ్యాధి లక్షణాలతో రాష్ట్రవ్యాప్తంగా 18 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా పాఠశాలలు అప్రమత్తమై ప్రభుత్వ సూచనలు పాటించి, పిల్లల ప్రాణాలను ప్రమాదం నుంచి తప్పించాలని పలువురు కోరుతున్నారు
గత 24 గంటల్లో 253 మందికి
రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 30,176 మందికి కరోనా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం 253 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించింది. గుంటూరులో ఒకరు మరణించారు. మరో 137 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1694 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరులో 69, చిత్తూరులో తూర్పుగోదావరిలో 29 కేసులు నమోదయ్యాయి రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7,186కు చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో పేర్కొంది.
0 comments:
Post a Comment