*ఉపాధ్యాయ, పాఠశాలల సమస్యలపై ముఖ్యకార్యదర్శి గారికి*. యుటిఎఫ్ ప్రాతినిధ్యం.....
తేదీ 01-03-2022.
పాఠశాల ముఖ్య కార్యదర్శి గౌరవ బుడితి రాజశేఖర్ గారిని శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో యు.టి.ఎఫ్ నాయకత్వం కలిసి పాఠశాలల్లో సమస్యలు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పాఠశాలలో బోధనా సమయం "యాప్" ల వలన బోధనకు ఆటంకం కలుగుతుందని, పాఠశాలలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని యాప్ ద్వారా నివేదించాలని విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులు పై ఒత్తిడి చేయడమే కాకుండా ఛార్జి మెమో లు ఇస్తూ ఉపాధ్యాయులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని వెంటనే ఇటువంటి చర్యలను ఆపాలని మరియు జగనన్న గోరుముద్ద, ఐ.ఎం.ఎం.ఎస్ ; ఎస్.టి.ఎం.ఎస్, విద్యార్థుల హాజరు యాప్, మధ్యాహ్న భోజన పథకం వివరాలు, చివరకు టాయిలెట్ల సమాచారం కూడా ఫోటోతో సహా అప్లోడ్ చేసే యాప్ లు సిగ్నల్ వ్యవస్థ సరిగా లేకపోవడం వలన సర్వర్లు సక్రమంగా పనిచేయని కారణంగా ఉపాధ్యాయులు విలువైన కాలాన్ని హరించి వేస్తూ ఉన్నాయి.
కావున వాటిని వెంటనే సరి చేయాలని దీంతో పాటు ఇటీవల బదిలీ కాబడిన ఉపాధ్యాయులకు జనవరి ఫిబ్రవరి నెలల జీతాలు నేటి వరకు చెల్లింపు కాబడి లేదని వెంటనే చర్య తీసుకోవాలని, బదిలీల్లో సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కారించాలని, పాఠశాలల్లో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు జగనన్న కిట్లు, పాఠ్యపుస్తకాలను వెంటనే సరఫరా చేయాలని, నాడు నేడు కార్యక్రమం లో సరిపడా నిధులు మంజూరు చేయకపోవడం వలన పలు పాఠశాలలో పనులు ఆగిపోయాయని వెంటనే ఆ నిధులను మంజూరు చేయాలని, సమస్య లో పరిష్కారం కోసం తగిన చర్యలు చేపట్టాలని కోరడమైనది.
పాఠశాల ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ గారు సానుకూలంగా స్పందించి వెంటనే పాఠ్యపుస్తకాలు, జగనన్న కిట్లు విడుదల చేస్తామని. అన్ని యాప్ లు క్రోడీకరించి ఒకే యాప్ గా మార్చి ఉపాధ్యాయులకు సులువుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, నాడు నేడు లో పనులు వేగవంతం చేయుటకు నిధులను వెంటనే విడుదల చేస్తామని యుటిఎఫ్ నాయకత్వం కు తెలిపారు.
ఈ కార్యక్రమంలోయు.టి.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ కిషోర్ కుమార్, కోశాధికారి బి. శ్రీరామ్మూర్తి , రాష్ట్ర కౌన్సిలర్ చౌదరి రవీంద్ర, జిల్లా కార్యదర్శివై.ఉమా శంకర్, ఆడిట్ కమిటీ కన్వీనర్ బి. రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా కమిటీ
ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్స్అప్ గ్రూపులో చేరండి https://chat.whatsapp.com/CdxlykccNOrCgy9QlxuET1
0 comments:
Post a Comment