AP Govt Employees Electrical Scuters సర్కారీ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్

*ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రభుత్వోద్యోగులకు బంపరాఫర్ అందిస్తున్నది.



లక్షకు పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌ను సిబ్బంది కోసం కొనుగోలు చేయనున్నది.తాజాగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుక్కోవాలని ఆసక్తి చూపుతున్న ప్రభుత్వోద్యోగులకు జగన్ ప్రభుత్వం చేయూతనివ్వనున్నది

ఈఈఎస్ఎల్‌తో ఏపీ సర్కార్ జట్టు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌)తో ఏపీ సర్కార్ జత కట్టింది.భారీగా ఈవీ టూ వీలర్స్‌ను ప్రభుత్వోద్యోగులకు సరఫరా చేసేందుకు సంబంధిత మోటారు సైకిళ్లు-స్కూటర్ల తయారీ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నది.


ఆకర్షణీయ వాయిదాల్లో ఇలా టూ వీలర్స్ఈ పథకం కింద ఈవీ టూ వీలర్స్ పొందిన వారికి తక్కువ వడ్డీరేటుపై ఆకర్షణీయ రుణ వాయిదాల కింద రుణాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత బ్యాంకర్లతో సంప్రదిస్తున్నది.కేఎఫ్‌డబ్ల్యూ, జీఐజడ్ వంటి గ్లోబల్ సంస్థలతోనూ చర్చిస్తున్నది.ప్రభుత్వోద్యోగులకు భారీగా విద్యుత్ టూ వీలర్స్ సరఫరా చేసేందుకు బిడ్లను ఆహ్వానించినట్లు ఆంధ్రప్రదేశ్ నూతన, సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ రమణారెడ్డి తెలిపారు


ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఫస్ట్‌టైంభారీ సంఖ్యలో ఒక రాష్ట్ర ప్రభుత్వం టూ వీలర్స్ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం ప్రపంచంలోనే ఇది తొలిసారని భావిస్తున్నారు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top