6వేల మంది ఉపాధ్యాయులకు నెలన్నరగా అందని వేతనాలు
పాఠశాల విద్యాశాఖ, ఖజానా, సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (సీఎఫ్‌ఎంఎస్) విభాగాల మధ్య సమన్వయ లోపం కారణంగా నెలన్నరగా సుమారు 6వేల మంది ఉపాధ్యాయులకు వేతనాలు అందడం లేదు. పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన బదిలీలు, హేతుబద్ధీకరణల్లో ఉపాధ్యాయులు ఒక బడి నుంచి మరొక బడికి మారారు. ఇలా మారిన వారు జనవరి 16న కొత్త పాఠశాలల్లో చేరారు. అప్పటి నుంచి 6వేల మందికి జీతాలు రావడం లేదు. పని చేసిన బడిలో వేతనం నిలిపివేసిన అధికారులు.. కొత్తగా చేరిన చోట నుంచి ఇవ్వడం లేదు. పాఠశాల విద్య కమిషనరేట్ నుంచి వివరాలు వస్తే వేతనాలు చెల్లిస్తామని మొదట్లో సీఎఫ్‌ఎంఎస్ మెలిక పెట్టింది. బడులు మారిన ఉపాధ్యాయుల వివరాలను ఇవ్వగా.. మొత్తం సిబ్బంది వివరాలు కావాలంటూ కోరింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు వినతులు ఇవ్వడంతో ఖజానాశాఖ ద్వారా వివరాలు సమర్పిస్తే సరిపోతుందని వెసులుబాటు ఇచ్చింది. సెకండరీ గ్రేడ్ టీచర్ల వివరాలను మండల విద్యాధికారులు, ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు కొత్తగా వచ్చిన వారి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఖజానా శాఖకు సమర్పించగా.. అక్కడి నుంచి సీఎఫ్‌ఎంఎస్‌కు చేరాయి. సీఎఫ్‌ఎంఎస్‌కు వివరాలు అందినా వేతనాల విడుదలలో జాప్యం జరుగుతోంది.
0 comments:
Post a Comment