సర్పంచ్ ఫలితం
పోలింగ్ లో సర్పంచ్ ఎన్నికకు పింక్ కలర్, వార్డు సభ్యుని ఎన్నికకు
తెలుపురంగు బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారు.
అయితే ఓటరు ఈ రెండింటి పైనా
ఓటు వేసిన అనంతరం వాటిని ఒకే బాక్సులో వేస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన ఆనంతరం నిర్దేశించిన ప్రదేశంలో కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు.
బ్యాలెట్
బాక్సుల్లోను అన్ని బ్యాలెట్ పత్రాలను ముందు బయటకు తీస్తారు. సర్పంచ్ వార్డు
సభ్యుల బ్యాలెట్లను విడదీయాలి.
25 బ్యాలెట్ పేపర్లను ఒక కట్టగా కట్టాలి.
తొలుత వార్డు సభ్యులకు సంబంధించిన ఓట్లను లెక్కించి ఆయా వార్డుల
విజేతలను ప్రకటిస్తారు.
అనంతరం సర్పంచ్ స్థానానికి వచ్చిన బ్యాలెట్ పత్రాలను పెద్ద డ్రమ్ములో వేసి కలియబెట్టాలి. ఏ వార్డులో సర్పంచ్ స్థానానికి ఎన్నేసి ఓట్లు పడ్డాయో తెలియకుండా ఉండడం కోసం అలా చేస్తారు.
25 చొప్పున కట్టిన బ్యాలెట్ పేపర్లను కౌంటింగ్ సూపర్‌వైజర్లకు అందించి లెక్కింపును
ప్రారంభిస్తారు. తర్వాత సర్పంచ్ విజేతను ప్రకటిస్తారు.
0 comments:
Post a Comment