కొత్తగా బదిలీలలో వచ్చిన ఉపాధ్యాయుల జీతాల సమాచారం
కొత్తగా వచ్చిన వారికి జీతాలు పెట్టేవిధానం.
1. ముందుగా regular employees కి జీతాలు బిల్ ddoreq లో సబ్మిట్ చెయ్యాలి.
2.తరువాత బదిలీలలో వచ్చిన వారికి జనవరిలో 14 రోజులకు మరియు ఫిబ్రవరి నెల జీతాలు manual గా ప్రిపేర్ చేసి NHRMS లో ఆ ఉపాధ్యాయుల జీతాలు REGULAR SALARY ఆప్షన్ తో బిల్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కొత్తగా వచ్చిన ఉపాద్యాయుల LPC లు JOINING రిపోర్ట్స్, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ మరియు ఇన్కమ్ టాక్స్
రిటర్న్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసి బిల్ TREASURY కి సబ్మిట్ చేసి STO కి చెప్పి బిల్ పాస్ చేయించుకోవచ్చు.
3. ఈ బిల్ సబ్మిట్ చేయుటకు ఫిబ్రవరి 16 నుండి 28 వరకు అవకాశం కలదు.
4. ఈ బిల్ జీతాలు బిల్ కావున బిల్ సబ్మిట్ చేశాక తగిన డాకుమెంట్స్ సబ్మిట్ చేసి పాస్ చేయించుకోవచ్చు..అంతే గాని ఈ బిల్ వచ్చేనెల 6 నుండి 10 వ తేదీ లోపలే పెట్టాలి అనేది కరెక్ట్ కాదు అది అవగాహనారాహిత్యం మాత్రమే ఈ బిల్ REGULAR బిల్ కావున ఈ నెలాకరులోపల పెట్టుకోవచ్చు..
5. కావున కొత్తగా వచ్చిన టీచర్స్ ఈ విషయం DDO దృష్టికి తీసుకొని వెళ్లి బిల్ పెట్టమని కొరవచ్చు. అట్లు కానియెడల నెక్స్ట్ MONTH 6 వ తేదీ పైన బిల్ పెట్టితే అది పాస్ ఐ మన అకౌంట్ లో క్రెడిట్ అయ్యేసరికి చాలా లేట్ అవుద్ది..లోన్స్ ఉండేవాళ్ళు ఇబ్బందిపడే అవకాశం గలదు.
Note: కొన్ని మండలాల్లో పై విధంగా నే కొత్తగావచ్చిన వారికి బిల్ సబ్మిట్ చేయడం జరిగింది.
0 comments:
Post a Comment