మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినాలు
అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగినులకు ఏడాదికి 5 రోజుల ప్రత్యేక సెలవు దినాల అమలుకు కృషి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ హామీ ఇచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో గురువారం సచివాలయంలోని సీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎస్ మాట్లాడారు. వేతన సవరణ సంఘం నివేదికను త్వరలో అందజేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఏప్రిల్‌లో జాయింట్ కౌన్సిల్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై శాఖలతో మాట్లాడి తక్షణమే పరిష్కరిస్తానని చెప్పారు. ఇప్పటికే సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై కమిటీలు ఏర్పాటు చేశామని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ వివరించారు.
0 comments:
Post a Comment