కొత్తగా ఇల్లు కొనేవారికి కేంద్రం శుభవార్త
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. 2022వ సంవత్సరం మార్చి 31 వరకు ఈ పథకం కొనసాగనుంది. 2022 వరకు దేశంలోని అందరికీ ఇళ్లు అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తెచ్చింది. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసినవారికి ఈ పథకం కింద కేంద్రం రాయితీ ఇస్తుంది.
దాదాపు 2 లక్షల 65 వేల వరకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది. అయితే దీన్ని లబ్ధిదారుడికి నేరుగా ఇవ్వదు. బ్యాంకు రుణం తీసుకుంటే రాయితీని బ్యాంకుకే అందజేస్తుంది. దీంతో లబ్ధిదారుడి తీసుకున్న రుణం అసలు లోంచి తగ్గిస్తారు. ఫలితంగా ఈఎంఐ తగ్గుతుంది. అసలు, వడ్డీని కలుపుకుంటే లబ్దిదారుడికి దాదాపు 6 లక్షల వరకు లబ్ది చేకూరుతుంది.
0 comments:
Post a Comment