మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టాఫీస్ కూడా సాంకేతిక పరిజ్ఙానాన్ని అందిపుచ్చుకుంటోంది. ప్రత్యేకంగా- ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) పేరుతో ప్రత్యేకంగా ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిద్వారా నెలవారీ రికరింగ్ డిపాజిట్ మొత్తాన్ని పోస్టాఫీస్‌కు వెళ్లకుండానే.. అక్కడ నిల్చునే ఇబ్బంది లేకుండా చెల్లించడానికి అవకాశం ఏర్పడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పోస్టాఫీస్ వరకూ వెళ్లకుండా నెలవారీ ఆర్డీ మొత్తాన్ని చెల్లించడంపై ఖాతాదారులు ఆసక్తి చూపుతున్నారు.
చెల్లింపు విధానం ఇలా..
1.ముందుగా యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవాలి
2.డీఓపీ ప్రొడక్ట్స్ అనే విభాగాన్ని ఎంపిక చేసుకోవాలి.
3.దానిపై క్లిక్ చేయగానే రికరింగ్ డిపాజిట్ అనే అక్షరాలు కనిపిస్తాయి.
4. ఆర్డీ నంబర్, కస్టమర్ ఐడీని పొందుపరచాలి. ఎంత మొత్తాన్ని చెల్లించాలి? ఇన్‌స్టాల్‌మెంట్ ఎంత అనేది ఎంపిక చేసుకున్న తరువాత అమౌంట్‌ను బదిలీ చేయాలి.
5.నెలవారీ మొత్తాన్ని డిపాజిట్ చేసిన వెంటనే ఆ సమాచారాన్ని పోస్టాఫీస్ నుంచి.. దీనికి సంబంధించిన సమాచారం అందుతుంది. దీనివల్ల ఇంట్లో నుంచే ఈ అమౌంట్‌ను చెల్లించే వెసలుబాటును పోస్టల్ డిపార్ట్‌మెంట్ కల్పించింది.
0 comments:
Post a Comment