ఉన్నత పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖాధికారులం దరికీ మనవి
త్వరలో మనకు QR code కలిగిన హెల్త్ కార్డులు ఇవ్వనున్నారు. వారం రోజుల లోపల వివరాలను సరిచేసుకోమని చెప్పారు. కనుక DDO లాగిన్ లో ఉండాల్సిన ఉపాధ్యాయుల పేర్లు ఉన్నాయా లేదా సరిచూసుకోవాల్సి ఉంది కనుక ఉన్నత పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు/ మండల విద్యాశాఖాధికారులు చేయవలసినవి
EHS DDO లాగిన్ లో ఏయే ఉపాధ్యాయుల పేర్లు ఉన్నవో సరిచూసుకొనుటకు
1) http://www.ehs.ap.gov.in/EHSAP అనే సైట్ లోకి మీ DDO code తో లాగిన్ అవ్వండి
2) Registrations tab లో Enrollment Worklist Status లోకి వెళ్ళండి. అందులో మీకు రిజిస్టరై ఉన్న ఉపాధ్యాయుల పేర్లు కనపడతాయి.
3) అందులో మీ పాఠశాల/మండలం లో పనిచేస్తూ ఉండి కూడా పేర్లు లేకపోతే వారి వివరాలు పాత DDO లాగిన్ లో ఉంటాయి. ఉపాధ్యాయులు వారి వ్యక్తిగత లాగిన్ లో DDO address ను మార్చుకోమని చెప్పండి
ఉపాధ్యాయులు వారి లాగిన్ లో DDO ను మార్చుకునే విధానం
1) మీ ట్రెజరీ ఐడీ తో లాగిన్ కండి
2) Initiate new/rejected beneficiaries అనే టాబ్ లోకి వెళ్ళండి
3) అక్కడ మీకు Note: please cross check the DDO details before submission ….. Please click here అనే టాబ్ కనపడుతుంది. దానిపై క్లిక్ చేయండి.
4) అందులో DDO వివరాలతో పాటు మీ వివరాలు కూడా తప్పుగా ఉంటే మార్చి సబ్‌మిట్ చేయండి
5) దీనితో మీ వివరాలు కొత్త DDO లాగిన్ లోకి వెళతాయి. DDO లాగిన్ లో యాక్సెప్ట్ చేయమని చెప్పండి. ఇంతటితో మీ వివరాలు కొత్త DDO లాగిన్ లోకి వెళతాయి.
ప్రధానోపాధ్యాలు /మండల విద్యాశాఖాధికారులు వారి లాగిన్ లోకి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులను చేర్చుకునే విధానం
1) ఉపాధ్యాయులు వారి వ్యక్తిగత లాగిన్ లో పైన చెప్పిన విధంగా DDO details మార్చుకున్న తర్వాత మీరు మీ DDO code తో లాగిన్ కండి.
2) Registrations tab లో Updated Employee Details Worklist లోకి వెళ్ళండి.
3) అక్కడ మీకు కొత్తగా మీ లాగిన్ లోకి వచ్చిన ఉపాధ్యాయుల పేర్లు కనపడతాయి. వారి హెల్త్ కార్డు ఐడీ పై క్లిక్ చేసి యాక్సెప్ట్ చేయండి.
4) తిరిగి Registrations tab లో Enrollment Worklist Status లోకి వెళ్ళండి. అందులో మీకు రిజిస్టరై ఉన్న ఉపాధ్యాయుల పేర్లు సరిచూసుకోండి.
ప్రధానోపాధ్యాయులు /మండల విద్యాశాఖాధికారులు లాగిన్ లో ట్రాన్ఫర్ ఐపోయిన ఉపాధ్యాయులను తొలగించుటకు
1) మీ DDO code తో లాగిన్ కండి
2) Registrations tab లో initiate transfer లోకి వెళ్ళండి
3) ట్రాన్ఫర్ చేయాల్సిన ఉపాధ్యాయుని ట్రెజరీ ఐడీ ఎంటర్ చేసి Retrieve details పై క్లిక్ చేయండి.
4) DDO అడ్రస్, జీతం, డిసిగ్నేషన్ తదితర వివరాలు మార్చి సబ్‌మిట్ చేయండి.
ఎవరికైనా లాగిన్ సమస్యలుంటే
1) http://www.ehs.ap.gov.in/EHSAP లోకి లాగిన్ కాకమునుపే Any issue/complaint లోకి వెళ్ళండి. వివరాలతో పాటు మీ కంప్లైంటును మీ సంతకం మరియు DDO సంతకంతో కూడిన పత్రాన్ని జతపరచి సబ్‌మిట్ చేయండి.
2) రెండు మూడు రోజులలో వివరాలు సరిచేయబడతాయి. ap_ehf@ysraarogyasri.ap.gov.in కు మీ కంప్లైంటును మెయిల్ చేయండి.
Pay grades in PRC2015 for Health card details updation...
>SGT :21230-63010 (XI)
>SGT 6yrs
22460-66330 (XII)
>SAs&LFL HM&SGTs(12yrs)
28940-78910 (XVII)
>SA -6yrs
29760-80930 (XVIII)
>HMs/SA12yrs/SGT24 yrs:
35120-87130 (XX)
>HMs6yrs:
37100-91450 (XXI)
>HMs12yrs (XXII)
కార్డు కొరకు జాయిన్ అయిన కొత్త లో ఇచ్చిన ఫోన్ నంబరు ఇప్పుడు ఉపయోగంలో లేకపోతే password తెలియక మార్పులు చేసుకోవడానికి login అవడం కుదరదు...
అట్టి సందర్భంలో EMPLOYEE మరియు వారి బెనిఫిషరీ యొక్క డీటెయిల్స్ అనగా
1.మొబైల్ నంబర్ (పాతది ఉపయోగంలో లేకపోతే )
2.Date of birth
3.ఆధార్ నంబర్స్
ను అప్డేట్ చేయుటకు ఈ క్రింది మెయిల్ అడ్రెస్ కు మెయిల్ పెట్టినచో మీకు వివరాలు అప్డేట్ చేయబడతాయి.
ap_ehf@ysraarogyasri.ap.gov.in
0 comments:
Post a Comment