దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్‌కు కేంద్రం నిర్ణయం
ఈ నెల 28, 29 తేదీల్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్
ఏపీ, పంజాబ్, గుజరాత్, అస్సాంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్
ఏపీలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కోసం కృష్ణాజిల్లా ఎంపిక
ఈ నెల 28న కృష్ణాజిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్
*✨ వ్యాక్సినేషన్‌కు సన్నద్ధత*
★ కరోనా వ్యాక్సిన్‌కు ట్రయల్‌రన్(డ్రై రన్)ను పక్కాగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
★ ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లాను మాత్రమే దీని కోసం ఎంపిక చేశారు.
★ ఈ నెల 28న జిల్లాలో ఎంపిక చేసిన ఐదు ప్రదేశాల్లో దీనిని నిర్వహించనున్నారు.
★ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత.. అందరికీ ఎలా వేయాలనేది ఇప్పటి నుంచే సన్నద్ధమవ్వడంలో భాగంగా.. ఈ ప్రక్రియను చేపడుతున్నట్టు కృష్ణా జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుహాసిని తెలిపారు.
★ ఈ ట్రయల్ రన్‌లో టీకా ఒక్కటే ఉండదని, మిగతా ప్రక్రియ అంతా వ్యాక్సినేషన్ జరుగుతున్నట్టుగానే ఉంటుందన్నారు.
★ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి,
★ ఉప్పులూరు పీహెచ్‌సీ,
★ విజయవాడలోని నక్కల్‌రోడ్డులో ఉన్న పూర్ణ ప్రైవేటు ఆసుపత్రి,
★ ప్రకాష్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్,
★ తాడిగడప ప్రభుత్వ పాఠశాలను డ్రై రన్ కొరకు ఎంపిక చేశాం అన్నారు.
★ సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని ఐదు కేంద్రాల్లో సిబ్బంది అంతా కలిసి డ్రై రన్‌లో పాల్గొంటారు
0 comments:
Post a Comment