అమ్మఒడికి అర్హులు కాకపోవడానికి సంబంధించిన నిబంధనలు.
(1).కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000/-, పట్టణ ప్రాంతాల్లో 12,000/- రూపాయలకు మించి ఎక్కువగా ఉంటే అమ్మ ఒడి వర్తించదు .
(2) ఒక కుటుంబానికి వెట్ ల్యాండ్ 3 ఎకరాలకు మించి ఉండడంకానీ , డ్రై లాండ్ 10 ఎకరాలకు మించి ఉండడంకానీ లేదా మొత్తం మీద 10 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న వారికి అమ్మబడి వర్తించదు .
(3) కరెంట్ బిల్ నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించి ఉండరాదు . లేదా గత ఆరు నెలలకు సగటున కరెంట్ బిల్లు 1800 యూనిట్లు వినియోగించి ఉండరాదు .నిర్దేశించిన యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్ వినియోగించిన వారికి అమ్మఒడి వర్తించదు .
(4) ప్రభుత్వ ఉద్యోగులు( CFMS ద్వారా శాలరీ పొందుతున్న వారు) , పెన్షన్ దారుల పిల్లలకు అమ్మవడి వర్తించదు . అయితే ఈ నిబంధన నుంచి శానిటరీ వర్కర్స్ను మినహాయించడం జరిగింది .
(5) 4 చక్రాల వాహనం కుటుంబంలో ఎవరి పేరు న ఉన్న అమ్మ ఒడి వర్తించదు . అయితే ట్రాక్టర్, టాక్సీ, ఆటోలకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది .
(6). గతంలో ఆదాయపు పన్ను చెల్లించి ఉన్న (Income tax returns) అట్టివారికి అమ్మవడి వర్తించదు .
(7) మున్సిపాలిటీలు నందు 1000 స్క్వేర్ ఫీట్ ల కంటే ఎక్కువ స్థలం ఉంటే అట్టివారికి అమ్మ ఒడి వర్తించదు .
0 comments:
Post a Comment