★ కొవిడ్ కారణంగా ఏపీలో వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఈరోజు ప్రకటన విడుదల చేశారు.
★ఏపీలో కరోనా ఉధృతి తగ్గిందని, కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి తగ్గిపోయిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల ఇది సాధ్యం అయింది అన్నారు
★ కొవిడ్ పరిస్థితుల తర్వాత పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని..
★ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
★ ఎన్నికల నిర్వహణ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని.. రాజ్యాంగ పరమైన అంశాలను పూర్తి చేయాల్సి ఉంటుందని ఎస్‌ఈసీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు
★ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో లేదని, 4 వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రమేష్ కుమార్ పేర్కొన్నారు.
★ తెలంగాణలో జీహెచ్‍ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు
0 comments:
Post a Comment