యువతకు (స్త్రీ /పురుషులు) ఫోర్ వీలర్ మినీ ట్రక్కు పధకం

 యువతకు (స్త్రీ /పురుషులు) ఫోర్ వీలర్ మినీ ట్రక్కు పధకం 

ఆంద్ర రాష్ట్ర ప్రభుత్వము EBC/BC/SC లబ్దిదారులకు ఆదాయ స్థితిని పెంచుటకు నికర మరియు నిరంతర స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఫోర్ వీలర్ మినీ ట్రక్కు (సరకు బట్వాడా యూనిట్) లను 60% సబ్సిడీతో అందజేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు లను కోరడమైనది. దీనికై ప్రభుత్వము జి.ఓ. నెం. 69, తేదీ 18.11.2020 నందు ఎంపిక నియమావళి విడుదల చేసినది. 


లబ్ధిదారుల ఎంపికకు అర్హతా ప్రమాణాలు :

1. దరఖాస్తు దారు కుటుంబ ఆదాయం నెలకు రూ. 10,000 మించరాదు.  

2. కుటుంబములో ప్రభుత్వ ఉద్యోగి / పెన్షనర్ ఉండకూడదు

3. కుటుంబం లో నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు

4. కుటుంబ సభ్యులు ఎవరూ ఆదాయపు పన్ను చెల్లింపు దారులై ఉండరాదు. 

5.అభ్యర్ధి స్థానికుడై ఉండవలెను.  

6.అభ్యర్ధి వయస్సు 21-45 సంవత్సరాలు అయి ఉండవలెను. 

7.కనీస విద్యార్హత  7వ తరగతి పాస్ అయి ఉండవలెను.

8.LMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను. 

9.గతంలో వాహన ఋణం తీసుకొని, బ్యాంకుకు డీఫాల్టర్ అయి ఉండరాదు. 

10.స్థానికత ధ్రువ పత్రము (ఆధార్, రైస్ కార్డు లేదా తాసీల్దార్ ధ్రువీకరణ)

11.కుల ధ్రువీకరణ పత్రం (ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్) కలిగి ఉండాలి. 


పధక ప్రణాళిక

లబ్ధిదారుని వాటా (10 శాతం) - రూ 58,119

బ్యాంకు ఋణము (30 శాతం) - రూ 1,74,357

ప్రభుత్వ సబ్సిడీ (60 శాతం) - రూ 3,48,714


ఎంపిక ప్రక్రియ 

మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధ్యక్షులుగా (బ్యాంకుమేనేజర్, ITDA ప్రతినిధి, రవాణాశాఖ ప్రతినిధి సభ్యులు)  గల స్క్రీనింగ్ మరియు ఎంపిక కమిటీ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి కనీస విద్యార్హత, ఆపై విద్యార్హత ఉన్నచో 10 మార్కులు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నచో 10 మార్కులు మరియు వాహనములు, రవాణాలపై సాధారణ అవగాహనకు, జనరల్ ఆప్టిట్యూడ్(యోగ్యత, సామర్ధ్యము) లకు 30 మార్కులు వెరసి 50 మార్కులకు గాను ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారి జాబితాను కుదించి మెరిట్ ప్రాతిపదికన తయారు చేయబడిన జాబితా ITDA ప్రాజెక్టు అధికారి వారికి పంపిచబడి ఉన్నతాధికారుల నుండి మంజూరు వచ్చినపిదప జాబితా ఎం.పీ.డీ.ఓ., తాసీల్దార్, గ్రామ సచివాలయంలలో ప్రదర్షింప బడుతుంది.


ఈ పధకం ద్వారా ప్రభుత్వ అదనపు లబ్ది

లబ్ధిదారుడు నికర నెలసరి ఆదాయము పొందుటకు గాను ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాల శాఖ 6 సంవత్సరముల పాటు పరస్పర అంగీకారమునకు లోబడి పని కల్పించుదురు.


సమయ ప్రణాళిక

నోటిఫికేషన్ తేదీ - 20.11.2020

దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ - 27.11.2020

ఇంటర్వ్యూ మరియు లబ్ధిదారుల ఎంపిక తేదీ - 04.12.2020

లబ్ధిదారుల ఎంపిక జాబితా ప్రకటన తేదీ - 05.12.2020

 

కావున ఆశక్తిగల వారు మీ మీ గ్రామ సచివాలయంలో సదరు దరఖాస్తును వెల్ఫేర్ మరియు విద్యా సహాయకునికి అన్ని ధ్రువపత్రములను జతపర్చి అందజేయవలెను.

Four Wheeler Truck Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top