విద్యాశాఖ మంత్రి గారితో ఈరోజు ఉపాధ్యాయ సంఘాల చర్చలు ముఖ్యాంశాలు

ఫ్యాప్టోతో విద్యాశాఖ మంత్రి గారితో చర్చలు విజయవంతం



21/11/2020 డిఇవో కార్యాలయాల పికెటింగ్ విరమణ


పాఠశాల విద్యాశాఖా మాత్యులు ఆదిమూలపు సురేష్ గారితో ఫ్యాప్టో నాయకత్వం రోజులు పాటు నడిపించిన నాయకత్వం జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. చర్చల్లో పాఠశాల కమీషనర్ వి. చిన వీరభద్రుడు, జాయింట్ డైరెక్టర్ డి దేవానంద రెడ్డి గారలు పాల్గొన్నారు.

1) SGT లకు మాన్యువల్ కౌన్సెలింగ్ విషయంలో కొత్త సాఫ్ట్వేర్ పై డెమో అనంతరం అది ఫలప్రదం కాకపోతే మాన్యువల్ కౌన్సెలింగ్ చేస్తామన్నారు.

2) స్టేషన్ పాయింట్లపై ఉన్న సీలింగ్ 11ఏళ్ళవరకూ పెంచడానికి అంగీకరించారు.

3) సర్వీసు పాయింట్లు 31 ఏళ్ళకు ఇస్తారు. అంటే 15.5

4) చైల్డ్ ఇన్ఫో లో మీడియం మారిన విషయంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకించి అప్పీలు ఇస్తే పరిష్కరిస్తారు.


5) ఖాళీలను బ్లాక్ చేసే విషయం లో ప్రతీ మండలాన్ని రివ్యూచేసి ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగని విధంగా చూస్తాము.


6) ప్రధానోపాధ్యాయులకు అకడమిక్ ఇయర్స్ కు

బదులుగా 5 పూర్తి సంవత్సరాలకు అంగీకరించారు.


7) పదవీ విరమణ కు 3 ఏళ్ళ లోపు సర్వీసు ఉన్న వారికి బదిలీల్లో మినహాయింపు కొరకు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

చర్చల్లో పాల్గొన్న వారు:


జి వి నారాయణ రెడ్డి, కె నరహరి, షేక్ సాల్టీ, ఎం రఘునాథ రెడ్డి, పి బాబు రెడ్డి, సి హెచ్ జోసెఫ్ సుధీర్ బాబు, పి పాండురంగ వరప్రసాద్, సి హెచ్ శరత్ చంద్ర, జి హృదయరాజు వి శ్రీనివాసరావు, జి శౌరీరాయలు, పి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

విద్యా శాఖ మంత్రి గారితో JACTO చర్చలు సఫలం.


1. స్టేష న్ గరిష్ట సీలింగ్ తొలగింపు.

2. సర్వీస్ పాయింట్స్ గరిష్టంగా 31 సంవత్సరాలకు అంగీకారం.

3. సర్వీస్ కు సంవత్సరం కు 0.5 అందరూ కు  అంగీకారం.

4. కాలిలను బ్లాక్ చేయడంలో సాంకేతిక సమస్యల పరిష్కారం.

5.upgradation పోస్ట్ ల ఖాళీల కు సంబందంచి కోర్ట్ ఉత్తర్వుల ప్రకారం చేస్తామని హామీ.


6. వెబ్ కౌన్సెలింగ్ కు డెమో చూపించి సమస్యలు ఉంటే manual కౌన్సిలింగ్ పై నిర్ణయం.


మాగంటి శ్రీనివాస రావు

NTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

JACTO మీడియా కన్వీనర్

Download FAPTO Press Note

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top