ప్రభుత్వ ఉద్యోగి సెలవుపై అతని కుటుంబముతో కలసి ఉద్యోగ ప్రదేశము (హెడ్ క్వార్టర్) నుండి స్వస్థలము (హోండాన్నకు గాని, రాష్ట్రములోని ఏ ప్రదేశమునకైనాగాని వెళ్ళివచ్చుటకు అగుప్రయాణ ఖర్చులను చెల్లించుటనే “లీవ్ ట్రావెల్ కన్సెషన్" (LTC)అంటారు. సర్విస్ మొత్తంలో ఒకసారి బ్లాక్ పీరియడ్ లోని చివరి రెండు సంవత్సరాల్లో దేశంలోని ఏ ప్రదేశానికైనా వెళ్ళువచ్చుటకు అనుమతించబడింది. (జిఓ. నం. 98, తేది. 21.06.2011)
1. అర్హత : 5 సం||ల కనీస సర్వీసుగల టెంపరరీ ఉద్యోగులతో సహా ఉద్యోగులతో సహా అరులు, కంటిజెంట్ సిబ్బంది, పార్ట్టైమ్ ఉద్యోగులు దీనికి అర్హులు కారు.
2 స్వస్థలం (Home Town): ఉద్యోగి జన్మస్థలం లేదా అతని తల్లిదండ్రులు, దగ్గర బంధువులు నివసించుచలము లేదా ఉద్యోగి స్థిరాస్థికలిగియున్న స్థలము, ఉద్యోగములో చేరకముందు నివాసమున్న స్థలము స్వస్థలముగా పరిగణించబడుతుంది. ఉద్యోగిbతాను మొదటిసారిగా ఎల్‌సి వాడుకొనే ముందు స్వస్థలము ధృవీకరిస్తూ నిర్ణీత ఫారంలో డిక్లరేషన్ ఇవ్వాలి. దానిని
3.కుటుంబం : టీఏ నిబంధనలలో నిర్వచించబడిన కుటుంబమే దీనికి కూడా వర్తిస్తుంది. ఉద్యోగి, అతని కుటుంబము& క్లెయిమ్ చేయుట : ఎల్ టీసి మొత్తమును క్లెయిమ్ చేయునప్పుడు టిఎ బిల్లునకు టిక్కెట్లను గాని, క్యాష్ రశీదుగాని, స్వంత డిక్లరేషన్‌గాని, బస్సు టికెట్లుగాని జతపరచవలెను. తిరుగు ప్రయాణం పూర్తి అయిన 30 రోజులలోగా బిల్లును పంపుకోవాలి.కంట్రోలింగ్ అధికారి అప్రూవ్ చేసి కార్యాలయాధిపతి (Head of Office) కి పంపినచో, వారు దానిని సర్వీసు రిజిష్టరులో నమోదు చేస్తారు. ఉపాధ్యాయులకు ఎంఇఓ /ప్రధానోపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయులకు డివైఇఓ నమోదు చేయాలి. ఈ డిక్లరేషన్ ను సర్వీస్ మొత్తంలో ఒకసారి మార్చుకోవచ్చు. వేర్వేరుగాని, కలిసిగాని ఎల్‌సి వాడుకొనవచ్చును. ఉద్యోగి కుటుంబము వేరే చోట నివాసముంటూ ఈ సౌకర్యం ఉపయోగించు కొనకపోతే అట్టి ఉద్యోగి స్వస్థలము వెళ్ళి వచ్చుటకు ఎల్‌సి వాడుకొనవచ్చును. భార్యా, భర్తలు కలసి వాడుకొనేప్పుడు ఒక్కరే ఎల్టీసి అర్హులు. కుటుంబ సభ్యులు ఒక బ్లాక్ పీరియడ్ లో ఒకసారి మాత్రమే ఎల్ పిసికి అర్హులు. ఈ సౌకర్యం సంతానంలో ఇద్దరికే పరిమితం చేయబడింది.
4. బ్లాక్ పీరియడ్ : ప్రతి 4 సం||ల కాలము ఒక బ్లాక్ పీరియడ్ గా పరిగణించబడుతుంది. మొదటి రెండు సంవత్సరముల నందు స్వస్థలము పోవుటకు, తదుపరి రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని ఏ ప్రదేశమునకైనా గాని, లేక హోంటౌన్ కు గాని, సర్వీస్మొత్తంలో ఒకసారి దేశంలో ఏ ప్రదేశానికైనా వెళ్ళి వచ్చుటకు ఎల్టీసిని వినిగియోంచు కొనవచ్చును.
5.తీసుకోవలసిన సెలవు:
క్యాజువల్ లీవుగాని, లేక అర్హతగల ఏ ఇతర సెలవుగాని పెట్టుకొని వెళ్ళాలి. ప్రభుత్వ సెలవు దినాలతోకలిపిగాని, కలపకుండా కాని వినియోగించుకోవచ్చు. కాని కేవలం ప్రభుత్వ సెలవుల్లో మాత్రమే వినియోగించు కోవటానికి వీలులేదు. అర్హతగల సెలవు మంజూరు చేయు అధికారి నుండి ఎల్‌సి వాడుకొనుటకు ముందస్తు పర్మిషన్ పొందాలి. వెకేషన్డిపార్టుమెంటుకు చెందినవారు వెకేషన్ లో కూడా ఈ సౌకర్యం వాడుకొనవచ్చును.
6. అడ్వాన్సు : ఎల్టీసి పై వెళ్ళి వచ్చుటకుగాను అంచనా వేయబడిన మొత్తం ఖర్చులో 80 శాతం వరకు అడ్వాన్సుగా పొందవచ్చు.మిగిలినది ప్రయాణం పూర్తి చేసి వచ్చి ఫైనల్ బిల్లు సమర్పించిన తర్వాత చెల్లిస్తారు.
7. చెల్లింపబడే మొత్తం : మొదటి 2 సం||లలో స్వస్థలమునకు వెళ్ళినప్పుడు గాని రెండవ బ్లాక్ పీరియడ్ లో రాష్ట్రంలోని ఏచోటుకైనను వెళ్ళునప్పుడుగాని పూర్తి దూరమునకు చెల్లింపు ఉండును. ఇతర రాష్ట్రములలో స్వస్థలము గలవారు ఉద్యోగం చేయుస్థలం నుండి మన రాష్ట్ర సరిహద్దు వరకు గల దూరమునకు మాత్రమే చెల్లింపు వుంటుంది. రైలు మార్గముండి, ఏ ఇతరవాహనముపై ప్రయాణించినను, దగ్గరి రైలు మార్గము ద్వారా ప్రయాణం చేసినప్పుడు అయ్యెడి చార్జీలను (టీఏ నిబంధనల మేరకు చెల్లిస్తారు. రైలు మార్గం లేనిచో బస్ (అర్హతను బట్టి డీలక్సు సర్వీసు వరకు) చార్జీలను చెల్లిస్తారు. దేశంలోని ఏ ప్రదేశానికైనావెళ్ళే సందర్భంలో ప్రయాణ దూరం 3500 కి.మీ., క్లెయిమ్ మొత్తం 12500/-లు గరిష్టంగా అనుమతిస్తారు.
0 comments:
Post a Comment